గెలిచి గంగవ్వ ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్.. వరాలిచ్చిన మెగా ఛీఫ్!
on Oct 19, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం ఎన్నో గొడవలు మరెన్నో స్ట్రాటజీలు మరెన్నో గాయాలు.. ఇలా ఎన్నింటినో చూపించిన సూపర్ స్మార్ట్ ఛార్జెస్, సూపర్ స్మార్ట్ ఫోన్స్ టాస్క్ పూర్తయింది.
మెగా ఛీఫ్ కోసం మొదలైన ఈ టాస్క్ లో రోజు రోజుకి ఆట స్వభావమే మారిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నబీల్, నిఖిల్, పృథ్వీ మొదటగానే అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు. ఇక ఓజీ టీమ్ అంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. రాయల్ క్లాన్ సూపర్ పవర్ చూపించారు. నిన్న జరిగిన బొక్క టాస్క్ లో చివరిగా రోహిణి, గంగవ్వ , గౌతమ్, మణికంఠ మిగిలారు. ఇంకేముంది బజర్ మోగగానే వరుసగా రెండు సార్లు గౌతమ్ చేతికే దక్కింది బోన్. దీంతో మణికంఠను మొదట తర్వాత రోహిణిని రేసు నుంచి తప్పించేశాడు గౌతమ్. ఇక చివరిగా గంగవ్వ -గౌతమ్ మిగిలారు. గౌతమ్ దూకుడు చూసి గంగవ్వ ఆ బొక్కని పట్టుకోడానికి ప్రయత్నించలేదు. ఇక గౌతమ్ దూకేసి మరీ బోన్ పట్టుకొని గెలిచాడు. ఇక ఆ తర్వాత మెహబూబ్ తన మెగా ఛీఫ్ బ్యాండ్ ని స్టోర్ రూమ్ లో పెట్టేసి బిగ్ బాస్ పంపిచ్చిన కొత్త బ్యాండ్ ని తీసుకొచ్చి గౌతమ్ కి ధరింపజేశాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా గౌతమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఇక గంగవ్వ కాళ్ళు మొక్కి గౌతమ్ తన ఆశీర్వాదం తీసుకున్నాడు.
మెగా చీఫ్ అయిన తర్వాత గౌతమ్ హౌస్ మేట్స్ అందరితో అర్థరాత్రి ముచ్చటించాడు. మన షో ప్రతి ఇంట్లో చాలామంది ఆడవాళ్లు చూస్తారు కాబట్టి వాళ్లందరికి ట్రిబ్యూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో హౌస్‌లో ఉన్న ఆడవాళ్లకి ఈ వారం వర్క్ హాలీడే ఇస్తున్నా.. మీరెవరూ ఇంటిపని, వంట పని, ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు.. మగాళ్లే బానిసల్లా పని చేస్తారు అంటూ గౌతమ్ మెగా ఛీఫ్ గా తన తొలి రిక్వెస్ట్ చేశాడు. ఇదే పని సీజన్-7 లో కెప్టెన్ అయిన తర్వాత కూడా గౌతమ్ చేశాడు. అయితే అక్కడ గేమ్‌లో మమ్మల్ని ఈడ్చి ఈడ్చి విసిరేసి ఇప్పుడు తీరిగ్గా విశ్రాంతి ప్రకటిస్తాడా అన్నట్లు లుక్ ఇచ్చారు లేడీ కంటెస్టెంట్లు. ఇక తను మెగా చీఫ్ కావడంతో తన కింద ఇద్దరు మినీ చీఫ్‌లను కూడా పెట్టుకున్నాడు గౌతమ్. గంగవ్వ-హరితేజ ఇద్దరూ మినీ చీఫ్లుగా చెప్పుకొచ్చాడు.
Also Read